పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి…ఎస్.ఎఫ్.ఐ

0
481

.

నవతరం, రౌతులపూడి: పాఠశాలలో మౌలిక వసతులులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.గంగ సూరిబాబు అన్నారు మంగళవారం మండలంలోని రౌతులపూడి. ములగపూడి. బలరామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించారు ఆయా పాఠశాలల్లో సమస్యలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఈనెల 16 నుంచి పాఠశాల ప్రారంభించినప్పటికీ కరోనా నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టకపోవడంతో విద్యార్థులను బడుగులకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు విద్యా కానుక కిట్లు బయోమెట్రిక్ తో కాకుండా పాఠశాలలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతులు మరియు మాస్కులు శానటైజర్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్. స్వామి. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.