నవతరం, విజయవాడ: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
శ్రీనివాసరెడ్డి కామెంట్స్….
ఎపిలో జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది.
అన్ని వర్గాల కంటే ఎక్కువుగా హింసింపబడేది జర్నలిస్టులు మాత్రమే.. అక్రిడేషన్ కమిటీలో అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేయడం దుర్మార్గం
ఇదంతా ఎపిలో జగన్నాటకం మాదిరిగా కనిపిస్తుంది. రాష్ట్ర కమిషనర్, కేసు వేసిన వ్యక్తి కలిసే హైకోర్టును ఆశ్రయించారు. దేశంలోనే ఆదర్శమైన సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి జర్నలిస్టుల ప్రాణాలను, వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? మాకు సంబందం లేదని చెప్పడానికి కమిషనర్ కి సిగ్గుండాలి. ఏమీ చేతకాక పోతే ఆ సీట్లో ఎందుకు? సిఎం ఆఫీసు జిఒ ఇస్తే… సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నాకు తెలియదనడం సిగ్గు చేటు సీనియర్ జర్నలిస్టులు హోదాలో ఉన్న వ్యక్తి సలహాదారులుగా ఉండి కూడా ఎందుకు మాట్లాడటం లేదు.. సిఎం అంగీకరించి జిఒ ఇస్తే… అమలు చేయకపోవడం దారుణం కాదా? జర్నలిస్టులు సలహాదారులు అయ్యాక… వైసిపి నాయకులుగా మారిపోయారా? ఇంత దారుణమైన పరిస్థితిని దేశంలో ఎక్కడా చూడలేదు. జర్నలిస్టుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధ పడతాం. మాకు రాజకీయాలు ఆపాదించినా మేము పర్వాలేదు. ఈనెల17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతాము. అప్పటికీ స్పందించకుంటే రెండు రోజుల పాటు సామూహిక దీక్షలు చేస్తాం అప్పటికైనా సలహాదారులకు సమస్యలు అర్ధమౌతాయో … అర్ధమై అర్ధం కానట్లు నటిస్తున్నారో… ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కారించాలని కోరుతున్నాం. లేదంటే.. సిఎం ఇచ్చిన జిఒ లనే ఎపిలో అమలు చేయడం లేదని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయవలసిన అవసరం వస్తుంది. ఎపి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు సుబ్బారావు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మరికొందరు కలిసి నిర్వహించిన సమావేశంలో జర్నలిస్టులకు సిఎం ఇచ్చిన హామీలు, చిన్న పత్రికల సమస్యలు, అక్రిడేషన్ల పై ఆంక్షలు, కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఐదు లక్షలు ఇస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వీటంటిపైనా సమావేశానికి హాజరైన అతిధులు మాట్లాడడం జరిగింది. నేటికీ ఏ ఒక్కరికి ఆ సాయం అందించలేదు కనుక వీటన్నింటి పైన మరోసారి అందరూ కలిసి సమావేశమై సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం. ఏదిఏమైనా ఇచ్చిన మాటకు జగన్మోహన్ రెడ్డి కట్టుబడి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న వారికి కష్టాల్లో కూడా ముందుండి నడుస్తూ దారి చూపే వారికి ఈ సమాజంలో గౌరవంగా భ్రతికేలా చూస్తారని ఆశిద్దాం…

