
నవతరం కాకినాడ రూరల్ : ఏదైనా ముఖ్యమైన శస్త్ర చికిత్స చేసేటప్పుడు రోగికి వైద్యులు ఇచ్చే మత్తునే అనస్తీసియా అంటారని, ఇది రోగులకు ఒక వరప్రసాదoలా పనిచేస్తూ వారి ప్రాణాలను నిలుపుతుందని ప్రముఖ మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నేదళ్ళ ఫణి కుమార్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ అనస్తీసియా దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 1846 అక్టోబర్ 16న అమెరికాలో డా WTC మోర్గాన్ ఈథర్ అనే మత్తు ఇచ్చిన తొలి శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో అప్పటినుంచి ఈ రోజున అనస్తీసియా దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారని తెలిపారు. రోగి ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మత్తు ఇస్తారని , మత్తు వైద్యులు లేకుండా శస్త్ర చికిత్సలు నిర్వహించడం సాధ్యం కాదని ,ఈ సంధర్బంగా కాకినాడ లోని మత్తు వైద్యులందరికీ డా.అడ్డాల సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ ఫణి కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో , డాక్టర్ కుమార్ యాదవ్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు.

