రోడ్లు వేయలేని అసమర్థ పాలకులు రాజీనామా చేయాలి.

0
422

నవతరం, కొత్తపేట: కొత్తపేటలో టిడిపి భారీ ధర్నా రావులపాలెం, ప్రయాణికుల పాలిట శాపంగా మారిన రహదారులను మరమ్మతులు చేయలేని అసమర్థ ప్రజాప్రతినిధులు సిగ్గుంటే తక్షణం రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. రోడ్ల అధ్వాన స్థితిలో పై కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కొత్తపేటలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అమలాపురం పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు రెడ్డి అంత కుమారి, అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ గంటి హరీష్ మాధుర్, అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ అయితాబత్తుల ఆనంద రావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు కోనసీమ కేంద్రానికి వెన్నెముక లాంటిదన్నారు. 15 లక్షల ప్రజానీకానికి ఐదు నియోజకవర్గాల ప్రజలకీ ప్రధానమైన రహదారిని ఈ రెండున్నర ఏళ్ళల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోడ్డు శిథిలమైందన్నారు. ఈ రోడ్డు పై ప్రయాణం చేయలేక ప్రజలు నరకం చూస్తున్నారని సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వానికి,స్థానిక ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్లు వేయండి మహాప్రభో…. ! అంటూ ప్రజల తరఫున అనేకసార్లు నిరసన నిరసన తెలియజేసాం, ఈ రోడ్లపై వరి నాట్లు నాటాం, పడవలపై ప్రయాణం చేసి చూపించాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసినా సిగ్గు కూడా లేదని ఎద్దేవాచేశారు. కనీసం గోతులు కూడా పూడ్చలేని ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్న కోనసీమ వాసి మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింత అనురాధ, స్థానిక శాసన సభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి అసమర్థ చేతకాని ప్రజా ప్రతినిధులు మనకు ఉండటం దురదృష్టం కరం, దౌర్భాగ్యం అని బండారు విమర్శించారు.ఆటోవాలా గానీ గర్భిణి స్త్రీలు, వృద్ధులు ఈ రోడ్లపై ప్రయాణం చేయడానికి అనేక అగచాట్లు పడుతున్నారని బండారు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు, ఈ ప్రజా ప్రతినిధులను అడుగుతున్నాం, ఎందుకు ఈ రోడ్లు వేయలేకపోతున్నారని, కనీసం మరమ్మతులు కూడా చేయలేక పోతున్నా మీరు…మీ మంత్రి పదవికి, పార్లమెంటు ప్రతినిధి సభ్యత్వానికి,స్థానిక శాసనసభ్యులు జగ్గి రెడ్డి గారిని తక్షణమే రాజీనామా చేయాలని బండారు డిమాండ్ చేస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి, కానీ రోడ్లు వేయరు అన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని బడ్జెట్ బడ్జెట్ లో కేటాయింపులు జరుపుతారు గానీ రోడ్లు వేయడం లేదని సుబ్రహ్మణ్యం విమర్శించారు. ఈప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు బడ్జెట్లో మూడు పద్ధతుల్లో 28182 కోట్లు రోడ్లు కేటాయించామని చూపించారు. ప్రతీ లీటర్ డీజిల్ పై 39 రూపాయలు టాక్స్ వసూలు చేస్తున్నారు. మళ్లీ అదనంగా ఒక రూపాయి సెస్సు వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ప్రజల నుండి దోచుకుంటున్నారని కానీ ఒక్క రోడ్డు కూడా వేయలేదని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని సుబ్రహ్మణ్యం విమర్శించారు.కోనసీమ ప్రధాన రహదారి రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు మీ ప్రజాప్రతినిధులకు కనబడుతుందా? అని ప్రశ్నించారు. ఈ రోడ్లపై ప్రయాణించే మంత్రులు ఎమ్మెల్యేలు కళ్ళు మూసుకుంటున్నారా? లేక నటిస్తున్నారా? నిద్రపోతున్నారా? అని జగన్మోహన్ రెడ్డి గారిని సుబ్రహ్మణ్యం సూటిగా ప్రశ్నించారు. రోడ్లపై ప్రయాణం చేయుటకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకోవడమే కాకుండా ప్రజల అవసరాలను తీర్చాలన్నారు. రావులపాలెం నుండి అమలాపురం వెళ్ళే రోడ్డును వెంటనే వేయాలని ఈ ప్రభుత్వాన్ని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. హరీష్ మాధుర్ మాట్లాడుతూ ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరకం కనబడుతుందని కోవిడ్ సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లాలంటే ఈ రోడ్లపై పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రావులపాలెం — అమలాపురం రోడ్డు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గంటలో ప్రయాణం చేరుకునేవారు ఇప్పుడు రెండున్నర గంటలు సమయం పడుతుందని సమయంతో పాటు శారీరకంగా కూడా అలిసి పోతున్నామని ఆరోపించారు. ఈ రోడ్లు వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, దండంగి మమత, కంఠంశెట్టి శ్రీనువాస్, ధరణాల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, గుబ్బల మూర్తి బూసి జయలక్ష్మీ బాష్కరరావు, ముత్యాల బాబ్జి, పల్లి భీమారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నవతరం. బోగి శెట్టి నాగేశ్వరరావు

.