మానవతా మూర్తి 25వ వర్దంతి…

0
374

మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బేన్నిబాబు, అనిల్ కుమార్, లోకేష్ తదితరులు…

పెదకూరపాడు, సెప్టెంబర్: 5, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మానవతా మూర్తి దేశవ్యాప్తంగా రోగులకు, అనాధలకు సేవ చేసిన అమ్మ మదర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రతి వారు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు అన్నారు. గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులోని జన చైతన్య సమితి కార్యాలయంలో ఆదివారం మదర్ తెరిసా 25 వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కోఆర్డినేటర్ వెలితోటీ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎవరు ఎంచుకొని మార్గాన్ని ఆచరించి మన భారతదేశానికి వచ్చి పెద్ద మనసుతో కుష్టు వ్యాధి గ్రస్తులకు, మురికివాడల్లో సేవలందించిందని అయన అన్నారు. నెహ్రూ యువ కేంద్ర నేషనల్ యూత్ వాలంటీర్ ఏటుకూరి లోకేష్ మాట్లాడుతూ చరిత్రలో మరువలేని మనిషి మదర్ తెరిసా అని ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమములో జన చైతన్య సమితి ప్రతినిధులు, బోంతా తంబిజోసఫ్, గంజి విజయబాబు, కారుణ్యబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.