పంచాయతీ అధికారులకు పట్టని ప్రజల ఆరోగ్యం… కలుషితాలకు నిలయంగా పోతులూరు…

0
51




నాలుగు నెలలుగా నో క్లోరినేషన్…

ఈ క్లోరినేషన్ చేసే వాల్ చూస్తే ఇక్కడ క్లోరినేషన్ చేసి ఎన్ని నెలలు కావస్తుంది తెలుస్తోంది.

నవతరం, ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు మండలం, పోతులూరు గ్రామంలో మంచినీరు కలుషితం. కరువైన పంచాయతీ అధికారులు పర్యవేక్షణ. పంచాయతీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సిడిపిఓ పద్మావతి ఇంత జరిగినా గ్రామంలో పర్యటించలేదు. క్లోరినేషన్ కోసం పంచాయతీ ఖర్చు చేస్తున్నట్లు రికార్డులలో కనిపిస్తుంది. కానీ ప్రజారోగ్యంపై పంచాయతీ అధికారులు చర్యలు కనిపించడం లేదు. పైపు లైన్ లీకులకు రిపేర్ చేయడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురికి కాలువల్లోనే పైపులైన్లు ఇది కూడా ఈ కలుషితానికి ఒక కారణమని చెప్పవచ్చు.

మంచినీటిలో విష పదార్థాలు కలిసే అవకాశం కల్పించిన పంచాయతీ అధికారులు. పైపులైన్లు రిపేర్లు గాలికొదిలేయడమే విష పదార్థాలు కలయకకు కారణమా?. వాటర్ ట్యాంక్ క్లినింగ్ చేసే అవకాశం లేదు. క్లినింగ్ చేసిన వేస్ట్ వాటర్ రిలీజ్ చేసే పైపు పనిచేయడం లేదు. పైపులు స్టక్ అయినా పంచాయతీ అధికారులకు పట్టడం లేదు. ఈ నీళ్లు తాగితే ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోను. ఎలాంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం.

ఏదిఏమైనా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి తప్పిదాలు మరోమారు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ అధికారులు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here