ఫెన్సింగ్ (కత్తి యుద్ధం ) లో, రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి, జాతీయ స్థాయి కి అర్హత సాధించిన భీమవరం తెలుగు తేజాలు…

0
285


పిల్లల్ని కని, పెంచి, దేశం గర్వించదగ్గ స్థాయికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అందరికీ కూడా అభినందనలు తెలిపారు, భీమవరం పట్టణ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.


నవతరం, భీమవరం: శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పట్టణ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయంలో క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపి మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్రీడా రంగంలో మన వారు ముందు ఉంటున్నారని, కత్తి యుద్ధంలో నైపుణ్యత సాధించి రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్ సాధించి జాతీయస్థాయికి ఎంపికైన, గీత సహస్ర, వేదాస్ వర్మలు మన ప్రాంతానికి గర్వకారణమన్నారు.
నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూఅండర్ -19 విభాగంలో, పేరిచర్ల గీత సహస్ర, కత్తి యుద్ధంలో ( ఫెన్సింగ్ ) లో రాష్ట్రస్థాయి లో కాకినాడ లో జరిగినటువంటి పోటీల్లో గోల్డ్మెడల్ సాధించి జాతీయ స్థాయిలో ఎంపిక కావడం, అండర్ 14 విభాగంలో పేరిచర్ల వేదాస్ వర్మ రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్ సాధించి జాతీయ స్థాయికి రాయపూర్ కి ఎంపికయ్యారని తెలిపారు.
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఫెన్సింగ్ కోచ్ కృష్ణమోహన్, మరియు క్రీడాకారులను గౌరవంగా సత్కరించారు.
ఎంపీపీ పేరిచర్ల నరసింహ బాబు, క్రీడాకారులు తల్లి తండ్రులు పేరిచర్ల పృద్వి రాజు, శ్రావణి, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, టౌన్ హాల్ సెక్రెటరీ కామన నాగేశ్వరరావు తదితరులు క్రీడాకారులను అభినందించి ఆశీర్వదించారు.