
స్థలం ఒకరిది…అనుమతులు మరొకరి…
కాసుల కోసం అధికారుల బరితెగింపు…
నవతరం; ఒక సెల్ టవర్ నిర్మాణం కోసం కాసులకు కక్కుర్తిపడి అధికారులు ఇచ్చిన తప్పుడు అనుమతులు వివాదంగా మారింది. అవినీతిలో ఆరితేరిన రెవెన్యూశాఖ స్థలం ఒకరిది అయితే, అనుమతులు మరొకరికి ఇచ్చారు. అంతేకాదు కావాలని చేశారో లేక తొందరపాటులో చేశారో గానీ గ్రామంలో లేని సర్వే నెంబరుతో ఆ స్థలానికి అనుమతులిచ్చారు. రెవెన్యూ వారేనా....? మే మేమీ తక్కువ తినలేదన్నట్టు సెల్ టవర్ నిర్మాణం కోసం వ్యక్తి పేరుతో ఈ ఏడాది జులై 28 న రెవెన్యూ అధికారులు అనుమతి ఇస్తే, గ్రామ పంచాయతీ అదే పేరుతో ఒకరోజు ముందు జులై27నే ఆతని పేరున తీర్మానం చేచేసింది.ఇలా రెవెన్యూ, పంచాయతీ అధికారులు తప్పుల మీద తప్పులు చేసి దొడ్డిదారిలో సెల్ టవర్ నిర్మాణానికి తమ వంతు సహాయసహకారాలు అందించడం వివాదాస్పద మైయింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో నిర్మిస్తున్న జియో టవర్ అవినీతికి అక్రమాలకు నిలయంగా మారింది. పోతులూరులో అల్లి పైడిరాజు పేరున పేరు ఉన్నది డాక్యుమెంట్ నెంబరు 1540/1981 రిజిస్ట్రేషన్ అయినది. ఆ స్థలాన్ని ఇప్పుడు జియో నిర్మాణానికి ఆక్రమన వ్యక్తి నాగులాపల్లి అప్పారావు పేరును గ్రామంలో లేని సర్వే నెంబరు 127, పెయిర్ అడంగల్ ద్వారా ఇచ్చినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు లేని నెంబర్లతో ఎందుకినట్లు అంటూ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్రిటీష్ వారి కాలం నాటి రికార్డు A.రిజిష్టర్ అని ఒకటుంది ఆ రికార్డును ఇప్పటి వరకూ ఏ ఒక్క అధికారి ఆ రికార్డును మార్చలేదు అలాంటిది ప్రత్తిపాడు రెవెన్యూ అధికారులకు దాని లెక్క లేదు ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకుని ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

