పోస్టాఫీస్ కస్టమర్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి….

0
429

నవతరం: పోస్టాఫీస్ కస్టమర్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లకుండానే డబ్బులు పొందొచ్చు. అకౌంట్ క్లోజింగ్ లేదా విత్‌డ్రా సేవలు పొందొచ్చు.


అయితే ఈ సేవలు అందరికీ కాదు.. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ SCSS, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్ వంటి పలు స్మాల్ సేవింగ్స్ డిపాజిట్ల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆ అకౌంట్లను క్లోజ్ చేసుకోవచ్చు కూడా.
ఇంతకు ముందు ఈ సేవలు అందుబాటులో లేవు. ఈ సేవలను పొందాలనుకునేవారు పోస్టాఫీస్‌కు ముందుగా ఒక ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఫామ్ ఎస్‌బీ 12ని నింపి సంబంధిత అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ తరపున లావాదేవీలు నిర్వహించడానికి వేరొకరికి అధికారం కల్పిస్తారు. మీకు సంబంధించిన అన్ని ట్రాక్సాక్షన్లు నిర్వహించే అధికారం వారికి ఉంటుంది.