తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 సిన్మాలు. దక్షిణాదినుంచి ఉత్తరాదిదాకా వెండితెరను ఊపేసిన అందాల తీర శ్రీదేవి నటించిన సిన్మాల సంఖ్య ఇది.

దాదాపుగా మూడొందల సిన్మాలు చేసిన నటిగా వెండితెరపై తన అందమైన ముద్రను వేసింది శ్రీదేవి. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి.

2017లో చివరిగా ‘మామ్’ చిత్రంలో నటించింది శ్రీదేవి. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్న ఘనత ఆమెది. సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు 2013లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.



