గుర్తు తెలియని మృతదేహం లభ్యం

0
181

గాజులరామరం కూడలి వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం

కుత్బుల్లాపూర్, (నవతరం): జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరం కూడలి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయ్యింది. స్థానికుల సమాచారం మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు మీడియాతో మాట్లాతు చనిపోయిన వెక్తి వయసు సుమారు 55 సంవత్సరాలు, 5.5 అడుగుల ఎత్తు ఉండవచ్చని, నలుపు రంగు ప్యాంటు, నీలి రంగు చొక్కా ధరించి ఉన్నాడని, తదనంతరం మృతదేహానికి పోస్టుమాటం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించాంమని. మృతుడి బంధువులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే జగద్గిరిగుట్ట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి ఫోన్ నెం :9989996002, పోలీస్ ఇన్స్పెక్టర్ పి. సైదులు ఫోన్ నెం : 9490617157 పై సంప్రదించాల్సిందిగా కోరారు.

మృతదేహం