క‌త్రినా రాస్తుంద‌ట‌!

0
926

మ‌ల్లీశ్వ‌రి..అదేనండీ క‌త్తిలాంటి కైఫ్ పుస్త‌కం రాయ‌బోతోంద‌ట‌. కుర్ర‌హీరో ర‌ణ్‌బీర్‌సింగ్‌తో చాలాకాలంపాటు ప్రేమ‌యాణం న‌డిపి అన‌ఫీషియ‌ల్‌గా హానీమూన్‌ల‌కు కూడా వెళ్లొచ్చి…అత‌నితో చెడ్డాక మ‌ళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ స‌ల్మాన్ చెంత‌కు చేరింది క‌త్రినాకైఫ్‌. ఇప్పుడంతా కుర్ర హీరోయిన్ల హ‌వా న‌డుస్తుండేస‌రికి అమ్మ‌డికి ఆఫ‌ర్లు అంత‌గా రావ‌డంలేదు. అందుకే బాగా తీరిగ్గా ఉందో ఏమో..ఓ పుస్త‌కం రాసి ప‌డేస్తే జ‌నం తీరిగ్గా చ‌దువుకుంటారనుకుంటోంది.

ఫిఫ్టీన్ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో కెరీర్ ప‌రంగానే కాదు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోనూ బోలెడ‌న్ని అనుభ‌వాల్ని మూట‌గ‌ట్టుకుంది క‌త్రినాకైఫ్‌. వాటన్నిటినీ పుస్తకంగా రాస్తే బావుంటుందనుకుంటోంది. 2003లో ‘బూమ్‌’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన కత్రినా కెరీర్ స్టార్టింగ్‌లో సజావుగా సాగలేదు. యాక్టింగ్‌ రాదని, డ్యాన్సులు చేయడం రాద‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కున్న క‌త్రినా కైఫ్ త‌ర్వాత క‌ళ్లు తిరిగే డ్యాన్సుల‌తో అంద‌రినీ మెప్పించింది.

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా అన్నిటినీ తిప్పికొట్టి స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌కి చేరుకునేందుకు ఎన్నో క‌ష్టాలు ప‌డింద క‌త్రినా. వైఫల్యాలు నాకు చాలా నేర్పించాయి. జయాపజయాల‌కు ఒకేరకంగా ఉండటం కీలకం. జీవితంలో ఎదిగిన వ్యక్తుల గురించి చదవడం వల్ల చాలా తెలుసుకుంటూ ఉంటాను. నాకెప్పుడూ బ్యాకప్‌ ప్లాన్లు ఉండవు. ప్లాన్‌ బి గురించి ఆలోచన వచ్చిందంటేనే వైఫల్యాన్ని అంగీకరించినట్లేనంటూ జీవిత సారాంశాన్ని వ‌ల్లెవేస్తోంది హీరోయిన్‌. మాట‌ల్లోనే ఇంత మ్యాట‌ర్ ఉంటే…ఇక పుస్త‌కంలో ఎన్ని విష‌యాలు రాస్తుందో ఏమో!