కోట్ల‌ గుండెల్ని కొల్ల‌గొట్టేసింది

0
699

ఎవ‌రి నోట విన్నా ఇప్పుడ‌దే పేరు. కుర్ర‌కారైతే ప్రియా..ప్రియా..అంటూ నిద్ర‌లోనూ క‌ల‌వ‌రింత‌లే.

ఒక్క అర‌నిమిషం వీడియోతో దేశమంతా ఫ్యాన్స్‌ని పోగేసుకుంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఒరు అదర్ లవ్ సిన్మాలో పాటకు ప్రియా ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఫిదా అయిపోయారంతా. అందులో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేకి ఈ అమ్మాయిమీద ఓ రేంజ్‌లో ప్రేమ కురిపించేస్తున్నారు.
ఎంతో మంది ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తున్నారు. సూప‌ర్ డూప‌ర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకొంద‌రైతే ఏకంగా డేటింగ్ వ‌స్తావా అంటూ అడిగేస్తున్నారు. రాత్రికిరాత్రే స్టార్‌డ‌మ్‌తో ఉక్కిరిబిక్కిర‌వుతోంది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. క‌నుబొమ్మ‌ల‌తో హావ‌భావాల్ని ప‌లికించాల‌ని డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్లు చేశార‌నీ..ఇంత పేరొస్తుంద‌ని క‌ల్లోకూడా ఊహించ‌లేదంటోంది క్యూట్ గాళ్‌.

అంతా ప్రియాగురించే మాట్లాడుకుంటుంటే ఇంత‌కీ ఆ అమ్మాయి క‌న్నుగీటిన కుర్రాడెవ‌రా అని ఇంకొంద‌రు ఆరాతీస్తున్నారు. ఆ కుర్రాడి పేరు అబ్దుల్లా ర‌వూఫ్‌. 18 ఏళ్ల ఈ కుర్రాడు ఐసీఏ ఫ‌స్టియ‌ర్ స్టూడెంట్‌. ఐదుగురు హీరో హీరోయిన్లుండే ఈ మ‌ళ‌యాళ సిన్మాలో ప్రియా, ర‌వూఫ్ ఓ జంట‌. రియ‌ల్ లైఫ్‌లోనూ ఫ‌న్నీగా ఉండే ర‌వూఫ్‌కి ప్రియా రేంజ్‌లో కాక‌పోయినా మొత్తానికి ఆ సీన్‌తో తెగ పాపులారిటీ వ‌చ్చేసింది.