
కోటవురట్లలో గేదెపై దాడి చేసిన పెద్దపులి
తుని నుంచి కోటవురట్ల చేరుకున్న పులి కోటవురట్ల మండలం టి. జగపేట శివారు శ్రీరాంపురంలో పెద్దపులి తిరుగుతుందన్న పుకారు నిజమైంది. చిన్న అనే రైతుకు చెందిన గేదెపై బుధవారం దాడి చేసి చంపి తింది. అటవీ శాఖ అధికారులకు నుంచి అందిన సమాచారం.. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పులి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు….

