
నవతరం, తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం పట్టణంలో మహిళా దారుణహత్య చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే తన భార్యని కడతేర్చిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. భాగ్యలక్ష్మి పేటకు చెందిన కామిశెట్టి సుబ్బలక్ష్మి అనే మహిళపై తన భర్త దేవరాజు కత్తితో దాడి చేసాడు. రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త కు తన భార్య పై అనుమానం ఉండేదని, కొంతకాలంగా తరచుగా గొడవలు పడుతున్నారని, అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

