టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య
పెద్దవంగర, అక్టోబర్27 ( నవతరం): బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ తీరుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలతో పాటుగా, ఎమ్మెల్యేలను సైతం ప్రలోభాలకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్, సోమ నరసింహారెడ్డి, ఏదునూరి శ్రీనివాస్, సుధాకర్, వెంకన్న, శ్రీరామ్ సంజయ్, భాస్కర్, పటేల్ నాయక్, భీమా నాయక్, రవి, లింగమూర్తి, హరీష్, గంగాధర్ పాల్గొన్నారు.


