ఏలేశ్వరం 3వ వార్డులో వైభవంగా దేవీ నవరాత్రుల ‘పసుపు రాట’ ఉత్సవం…

0
25

నవతరం, ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీ జువ్విన వీర్రాజు వారి సతీమణి రాఘవమ్మ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘పసుపు రాట’ మహోత్సవం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ శ్రీ ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here