వరికోత మిషన్ డ్రైవర్ నిర్లక్ష్యం… వ్యక్తి మృతి

0
144

అందోల్ / మెదక్, అక్టోబర్ 25 (నవతరం): ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ ఎక్కడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ధన్నూర గ్రామంలో చోటు చేసుకుంది. టేక్మాల్ మండలం ధన్నూర గ్రామానికి చెందిన మంగలి బషయ్య వయస్సు (44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఘటన జరిగిన రోజున పొలం వద్ద నిద్రిస్తున్న బషయ్య మీద నుంచి ప్రమాదవశాత్తు వరికోత మిషన్ వెళ్లడంతో విలవిలలాడుతూ అక్కడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బషయ్యకు భార్య అంజమ్మ(35), ఇద్దరు కుమారులు శివ కుమార్(15), ప్రమోద్ (11) ఉన్నారు. స్థానిక ఎస్సై లింగం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని  జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.