యువత యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి….

0
172


నవతరం, గుంటూరు: మేరా భారత్ రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్ గుంటూరు, యువత యోగానును నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనం అని మేరా యువ భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాం రాష్ట్ర సంచాలకులు అన్షుమన్ ప్రసాద్ దాస్ అన్నారు. గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలోని వేదవ్యాస భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను మేరా యువ భారత్, గుంటూరు, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సంయుక్త ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్షుమన్ ప్రసాద్ దాస్ హాజరై యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. యువత ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో అతిథులుగా కిరణ్మయి దేవిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, మేరా యువ భారత్, గుంటూరు, దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం, శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, జి. ఆంజనేయులు, డీన్, పి. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, రాఘవేంద్రరావు, ప్రిన్సిపాల్, టి. వినోద్ కృష్ణ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పి.శృతి, యోగా ఇన్‌స్ట్రక్టర్ పాల్గొన్నారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ పి.శృతి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, అధ్యాపకులు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా పట్ల తమ ఆసక్తిని చాటుకున్నారు.