రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన గ్రంధి శ్రీనివాస్

0
383

నవతరం, భీమవరం; రైతులకు అందుబాటులో మల్టీపర్పస్ సేవలు భీమవరం వరి, ఆక్వా రైతులకు మల్టీ పర్పస్ ఫెసిలిటీస్ కేంద్రాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి తాసిల్దార్ ఏ వి రమణ రావు, డిప్యూటీ తాసిల్దార్ గ్రంధి పవన్, సర్వేయర్ నాగబాబు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమవరం మండలంలో కొవ్వాడ, చిన అమిరం, ఎల్ ఎల్.వి యన్ పురం, తుందుర్రు గ్రామాలకు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ లు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ గ్రామాలలో ప్రభుత్వ భూమిని గుర్తించి వీటి నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఈ కేంద్రాల ద్వారా వరి, ఆక్వా రైతులకు సంబంధించి అన్ని రకాల సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా వరి, ఆక్వా రైతులకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెండు విడతలుగా రైతు భరోసా ను అందించడం జరిగిందని అన్నారు. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించడంతో పాటు, జీరో వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించడం జరిగిందని అన్నారు. రైతుల సంక్షేమానికి రానున్న రోజుల్లో మరింతగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.