మధ్యలో దువ్వాడ జగన్నాథం-డీజే తేడాకొట్టిందనేగానీ అల్లువారబ్బాయికి ఇండస్ట్రీలో బాగానే కలిసొస్తోంది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న అల్లు అర్జున్ సిన్మా నాపేరు సూర్య రిలీజ్‌కి ముందే లాభాలు మూటగట్టుకునేలా కనిపిస్తోంది. అయిన ఖర్చుకు, వర్కవుట్ అవుతున్న బిజినెస్‌ని చూస్తే స్క్రీన్‌కి ఎక్కకముందే సేఫ్ అనే టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్‌లో లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. నైజాంలో నా పేరు సూర్యకి మంచి రేటు పలికిందని చెబుతున్నారు. బన్నీ సిన్మాలకు నైజాంలో మ్యాగ్జిమమ్ రికార్డ్ 20 నుంచి 21కోట్లదాకా ఉంటే..నా పేరు సూర్యకు రూ.21.5 కోట్లు పలికింది.
నాపేరు సూర్య సినిమా బడ్జెట్ దగ్గరదగ్గర 70కోట్లు దాటింది. డిజిటల్ రైట్స్, థియేటర్ రైట్స్ అన్నీకలిపి బిజినెస్ 100కోట్లను దాటుతోంది. సో..ప్రొడ్యూసర్లకు ఏ టెన్షన్ లేనట్లే. ఏ మార్పులూ లేకపోతే ఏప్రిల్ 26న జనం ముందుకు రాబోతోంది నాపేరు సూర్య.

