మెగా అభిమానులందరికి పూనకాలు రప్పించే వార్త చెప్పబోతున్న ఉపాసన….

0
455

నవతరం: మన టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ జంటల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వారిలో ముందు వరుసలో ఉంటారు రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెల జంట, దశాబ్దం క్రితం అతిరథ మహారథుల సమక్షం లో అంగరంగ వైభవం గా జరిగిన ఈ ఇద్దరి పెళ్లి ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది, ఇన్నెళ్ళు వీరి దాంపత్య జీవితం లో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఒక్కరిని ఒక్కరు అర్థం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఆదర్శ దంపతులుగా నిలిచారు,ఇక ఉపాసన కొణిదెల దేశ వ్యాప్తంగా ఉన్న అప్పొల్లో హాస్పిటల్స్ కి చైర్మన్ అనే విషయం మన అందరికి తెలిసిందే,ఒక్క పక్క ఇంత పెద్ద బాధ్యతని భుజాలపై మోస్తూ మరోపక్క భర్త బాగోగులు చూసుకుంటుంది,ముఖ్యంగా చరణ్ విషయం ఆమె ఎంతో శ్రద్ద తో మెలుగుతుంది,ఒక్కప్పుడు చరణ్ కి చాలా కోపం ఉండేది, కానీ ఉపాసనా కొణిదెల తన జీవితం లో వచ్చినప్పటినుండి రామ్ చరణ్ పూర్తిగా మారిపోయాడు అని చెప్పాలి, వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానులు చూసి అభిమానులు ఎంతో మురిసిపోతూ ఉంటారు, అయితే ఇప్పుడు అలాంటి అభిమానులకు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక్క వార్త సంతోషంతో గంతులు వేసేలా చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే టాక్ సోషల్ మీడియా లో గట్టిగ వినిపిస్తుంది,ఇనాళ్ళు ఉపాసన మరియు రామ్ చరణ్ జీవితం లో ముఖ్యమైన లక్ష్యాలను అందుకోవడం కోసం పిల్లల్ని కనే ఆలోచనలు కొంత కాలం దూరం పెట్టాము అని స్వయంగా వాళ్ళే పలు ఇంటర్వూస్ లో తెలిపినా సంగతి మన అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు ఇద్దరు వారి కెరీర్స్ పరంగా ఎవ్వరు ఎందుకోలేని స్థాయికి ఎదిగి స్థిరపడడం తో ఇప్పుడు సంతానం కోసం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం, అంటే త్వరలోనే రామ్ చరణ్ ని తండ్రిగా మరియు మెగాస్టార్ ని తాత చూడబోతున్నాము అన్నమాట, మెగా అభిమానులు ఎప్పటి నుండో ఈ వార్త కోసం ఎంతో తీవ్రంగా నిరీక్షిస్తున్నారు,వాళ్లకి ఈ వార్త ఒక్క పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు, అయితే సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ అటు ఉపాసన నుండి కానీ, ఇటు రామ్ చరణ్ నుండి కానీ ఎలాంటి వివరణ రాలేదు, అయితే ఉష మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంతో కొంత నిజం లేకపోతే అసలు ఆ వార్తే బయటకి వచ్చేది కాదు కదా అంటూ అభిమానుల్లో వినిపిస్తున్న వాదన.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానైకి వస్తే దాదాపు మూడేళ్ళ నుండి ఆయన ఎన్టీఆర్ తో ఆకలిసి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కి అతి త్వరలోనే గుమ్మడి కాయ కొట్టేయబోతున్నారు,వాస్తవానికి ఈ సినిమాని అక్టోబర్ 13 వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసారు,ఇప్పటికి కూడా అదే రోజు రావాలి అని చిత్ర యూనిట్ మొత్తం గట్టిగ ప్రయత్నిస్తుంది, కానీ ఈ సినిమా ఆడాలి అంటే కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడితే సరిపోదు, పాన్ ఇండియా లెవల్ లో అన్ని మర్కెట్స్ లో కలెక్షన్స్ రావడం తప్పనిసరి పరిస్థితి, కానీ ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికి థియేటర్స్ తెరుచుకోలేదు, కేరళ వంటి ప్రాంతాలలో డిసెంబర్ వరుకు థియేటర్స్ తెరవలేని పరిస్థితి,ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా అక్టోబర్ 13 వ తేదీన రావడం కష్టం అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త, ప్రస్తుతం షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతున్నా షూటింగ్ పూర్తి అవ్వగానే ఇండియా కి వచ్చిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ కొత్త విడుదల తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది.