మంత్రిగారి స్వ‌చ్ఛ‌భార‌త్‌..

0
635

ఆయ‌నో బాధ్య‌త‌గ‌ల మంత్రి. అందునా దేశాన్ని స్వ‌చ్ఛ‌భార‌త్‌గా మార్చేందుకు కంక‌ణాలు, క‌డియాలు తొడిగేసుకున్న మోడీ పార్టీకి చెందిన మంత్రి. అన్నిటికీ మించి స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తున్న జైపూర్ గోడ‌ని ఇలా పావ‌నం చేశారు రాజ‌స్థాన్ ఆరోగ్య‌శాఖ మంత్రి కాళిచ‌ర‌ణ్‌.

ఏ మొహం పెట్టుకుని చెబుతారు నీతులు?

రూల్స్‌ప్రకారం అక్కడ రోడ్ల‌పై మూత్ర విసర్జనకు రూ.200 జరిమానా విధిస్తారు. సొంత నియోజకవర్గంలో మంత్రి ఘ‌నకార్యం బీజేపీ ప‌రువుతీసేలా ఉంది. దేశాన్ని శుభ్రంగా ఉంచ‌డం త‌ర్వాత‌…ముందు ఎంత అర్జంట్ అయినా కాస్త కంట్రోల్ చేసుకోమ‌ని పార్టీ నేత‌ల‌కు చెబితే మంచిదేమో! చెప్పేటందుకే నీతులున్నాయ‌నుకునే నేత‌లున్నంత కాలం ఇలాంటి సీన్లు కాక మ‌రేం క‌నిపిస్తాయి?

మీరెంత ఊడ్చినా మీవాళ్లే పోసేస్తున్నారు..చూస్కోండి