దొడ్డిదారి లో సెల్ టవర్ నిర్మాణం….

0
353

స్థలం ఒకరిది…అనుమతులు మరొకరి…

కాసుల కోసం అధికారుల బరితెగింపు…

నవతరం, ప్రత్తిపాడు:  అధికారులు తల్చుకుంటే కానిదంటూ ఏముంటుంది..? 
అందులో రెవెన్యూ అధికారులు లైతే మరీనూ, ఉన్నదిలేనట్టు లేనిదేది ఉన్నట్లు చూపగ సమర్థులు. వీరికి  రాజకీయ అధికార పార్టీ నేతలు తోడైతే, లేని సర్వే నెంబర్లు ఉన్నట్టుగా, ఉన్న భూమిని లేనట్టుగా చూపించగల సమర్థులు, ఒక సెల్ టవర్ నిర్మాణం కోసం  కాసులకు కక్కుర్తి పడి, రాజకీయ నాయకుల అండతో అధికారులు ఇచ్చిన తప్పుడు అనుమతులు ఇప్పుడు వివాదం గా మారింది. అవినీతిలో ఆరితేరిన రెవెన్యూశాఖ స్థలం ఒకరిది అయితే, అనుమతులు మరొకరికి ఇచ్చేశారు. అంతేకాదు కావాలని చేశారో గానీ లేక తొందరపాటు లో చేశారో గానీ గ్రామంలో లేని సర్వే నెంబరు ఆ స్థలానికి తగిలించారు.  రెవెన్యూ శాఖ వారేనా….?  మేమూ తక్కువ తినలేదన్నట్టు అనుమతుల కోసం దరఖాస్తు చేయ కుండానే సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేశారు.  ఈ ఏడాది జులై 28 న రెవెన్యూ అధికారులు ఒకరి పేరునున్న భూమిని మరొకరి పేరుతో అనుమతు  లిస్తే, గ్రామ పంచాయతీ మరో అడుగు ముందుకేసి అదే పేరుతో ఒకరోజు  ముందు జులై27నే ఆతని పేరున తీర్మానం చేచేసింది.ఇలా రెవెన్యూ, పంచాయతీ అధికారులు తప్పుల మీద తప్పులు చేసి  దొడ్డిదారిలో  సెల్ టవర్  నిర్మాణానికి తమ వంతు సహాయసహకారాలు అందించడం ఇప్పుడు  వివాదాస్పద మైయింది.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో  అల్లి పైడిరాజు పేరున 240చదరపు గజాల స్థలం ఉంది. చాలాకాలం దీంట్లో పాక వేసుకుని జీవనం సాగించారు. అయితే కొన్ని కారణాలతో రెండేళ్ళ క్రితం పైడిరాజు అతని భార్య తన సొంత ఊరైన చంద్రపాలెం వెళ్లిపోయారు. ఈ కాళీగా ఉన్న స్థలంలో నాగులాపల్లి అప్పారావు అనే వ్యక్తి తాను పశువుల పాక వేసుకుంటానని, మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కాళీ చేసి ఇచ్చేస్తానని  హామీ ఇవ్వడంతో వారు అంగీకరించారు. అయితే తన భర్త మరణించాడని, తాము ఊళ్ళో లేకపోవడంతో నాగులాపల్లి అప్పారావు స్థలం తనది గా తాహశీల్దార్ కార్యాలయంలో అనుమతులు తెచ్చుకొని సెల్ టవర్ నిర్మాణానికి ఇచ్చుకున్నాడని పైడిరాజు భార్య పాపాయమ్మ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసింది. తమ గ్రామంలో 127 సర్వే నెంబర్ లేదని, లేని సర్వే నెంబరు వేసి తాహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అతని భూమి గా అనుమతులు ఇచ్చారని పాపాయమ్మ ఆరోపిస్తోంది. అంతే కాదు అని మా గ్రామానికి చెందని ఫెయిర్ అడంగల్ అని రిపోర్టులో రాసారని, ఉన్నది “ఎ” రిజిస్టర్  అని పాపాయమ్మ కలెక్టర్ కిచ్చిన పిర్యాదు లో పేర్కొంది. తాసిల్దార్ కార్యాలయంలో అప్పారావు పేరున అతనిది గా 2021 జులై 28న ఇస్తే, ఒక రోజు ముందే అంటే,2021జులై 27నే దీన్ని ఆధారం చేసుకుని అప్పారావు పేరుతో సెల్ టవర్ కు అనుమతులు ఇస్తున్నట్లు తీర్మానం కూడా చేసేసారని పాపాయమ్మ ఆరోపించింది. కనీసం ఎప్పుడు పంచాయతీ సమావేశం జరిగిందో వార్డ్ నెంబర్లు కూడా తెలియదని వార్డు మెంబర్లకు తెలియకుండా ఎలా తీర్మానం చేశారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీని పై సమగ్ర విచారణ జరిపి తన స్థలం తనకు ఇప్పించాలని, రికార్డులు మార్చేసి అవకతవకలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాపాయమ్మ విజ్ఞప్తి చేసింది. 
రెవెన్యూ అధికారులా…..మజాకా…?