దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం కాస్త తీవ్ర తుఫాను మారే అవకాశం ఉంది..

0
337

నవతరం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఇది వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపిందని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఒక ప్రకటనలో కోరారు.

తుపాను ఈ నెల 10వ తేదీన తీరందాటే అవకాశం ఉంది కాబట్టి జిల్లాలో 8, 9, 10 తేదీలలో అనేకచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు పొలంలో ఉండే పంటను కాపాడుకునేందుకు తగిన సలహాలు సూచనలు అందజేయాలని, కోసిన వరి పంటను భద్రపరచుకోవడం తోపాటు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైతుల అందరినీ చైతన్యవంతులను చేయాలని అధికారులు కోరారు. క్షేత్రస్థాయి అధికారులు, వాలంటీర్లు అందరు తమ తమ హెడ్ కొటర్ లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. భీమవరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299189 కు ఫోన్ చేసి తుఫాన్ ఎటువంటి ఇబ్బంది కలిగినా సమాచారం ఇస్తే అధికారులు వెంటనే సహాయక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. రైతుల నుండి ధాన్యాన్ని నిరంతరాయంగా కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.