తండ్రి పాత్ర‌లో పుజారా

0
470

టీమిండియా ఆల్ రౌండ‌ర్ ఛ‌తేశ్వర్‌ పుజారా ఆరు బాల్స్‌లో ఆరు సిక్స‌ర్లు కొట్టినంత హ్యాపీగా ఉన్నాడు. తండ్రి కావ‌టంతో వ‌ర‌ల్డ్ కొప్పినంత ఆనందంగా ఉన్నాడా క్రికెట‌ర్‌. పుజారా భార్య పూజ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోష సందర్భాన్ని ట్విటర్‌లో అందరితో పంచుకున్నాడు పుజారా. పాప, భార్యతో కలిసి దిగిన ఫొటోను పెట్టాడు.

‘చిన్నారికి స్వాగతం. మా జీవితంలో కొత్త పాత్రలు పోషించేందుకు మేం చాలా ఆత్రుతగా, అత్యంత ఆనందంగా ఉన్నాం. మా కోరిక నెరవేరింది. చిన్నారి మా జీవితంలోకి ప్రవేశించింది’ అని పుజారా కామెంట్ పెట్టాడు.

భార్య పూజ‌, చిన్నారి పాప‌తో పుజారా

2018 ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని పుజారా ప్రస్తుతం తన దేశవాళీ జట్టు సౌరాష్ట్ర తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. పుజారా జనవరి 1నే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని ఉంచి తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ముందే చెప్పాడు. ఈ ఏడాది తామో బుజ్జిపాపను కోరుకుంటున్నామని అందులో చెప్పాడు. పుజారా దంపతులు తల్లిదండ్రులైన సందర్భంగా మిత్రులు, అభిమానులు అభినందనలు తెలిపారు.