గర్భిణీలకు పౌష్టికాహారంతో ఎంతో మేలు…

0
294

నవతరం, భీమవరం: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సుఖ ప్రసవంతో పాటు ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని, పండ్లు ఆకుకూరలు, గ్రుడ్లలో పోషక విలువలు కలిగిన అహారం తీసుకుంటూ, వైద్యులు చెప్పిన సూచనలు పాటించాలని, భీమవరం ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ నవీన అన్నారు.


శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో , గర్భిణీలకు శుక్రవారం అందించే పౌష్టికాహారం ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. శోభన్ బాబు అభిమాన సంఘం, జిల్లా అధ్యక్షులు భట్టిప్రోలు శ్రీనివాస్ కార్యక్రమం ప్రారంభించారు. అయన మాట్లాడుతూ పేదరికంతో గర్భిణీలు ఆర్థిక స్తోమత లేక, అనేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీ విజ్ఞాన వేదిక సేవా సంస్థ చేస్తున్న పౌష్టికాహార పంపిణీ అభినందనీయమని, భవిష్యత్తులో నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలిపారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ నవీన్ ఆర్థిక సహకారంతో, ఐదు వేల రూపాయల విలువైన పౌష్టికాహారం, వేరుశనగ బెల్లం అచ్చులు, అరటి పండ్లు, గోంగూర, పాల కూర, బిస్కెట్లు, కోడిగుడ్లు, బ్లడ్ ప్యాకెట్లు, 49 మందికి సంపూర్ణంగా అందించామని తెలిపారు. ఈ కార్యక్రమం భీమవరం లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, కోండ్రు శ్రీను, ఏఎన్ఎంలు మరియు నర్సులు పర్యవేక్షణలో జరిగింది.