కొత్తపేట మార్కెట్ పీఠంపై కూర్చొనే మహారాణి ఎవరో…?

0
320

వెదుకులాటలో స్థానిక అధిష్ఠానం…


నవతరం, రావులపాలెం: రాష్ట్రంలోనే కొత్తపేట మార్కెట్ కమిటీకి ఒక పేరు, ప్రత్యేకత ఉంది. రావులపాలెం మార్కెట్ యార్డు అరటి ఎగుమతులకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాత స్థానం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవే. గతంలో అయితే ఎమ్మెల్యే తనకు అనుకూలంగా, ఆయన చెప్పుచేతల్లో ఉండే వ్యక్తులకు కట్టబెట్టిస్తూ వచ్చేవారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పడవులన్నీ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందులో మహిళలకు 50 శాతం కేటాయించారు. ఇప్పుడు కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాళీ అయింది. మహిళలకు 50 శాతం కేటాయించడంతో ఆ క్రమంలో కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళలకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఒక వరంలా మారింది. ఎందుకంటే, కొత్తపేట మండలంలో శెట్టిబలిజ కులస్తులంతా ఆయనపై గుర్రుగా, వ్యతిరేకంతో ఉన్నారు. కొత్తపేట మండల పరిషత్ అధ్యక్ష పదవిని నియోజవర్గంలో ఓట్ల పరంగా అంతగా ప్రాధాన్యత లేని ఆయనకు అనుచరుడైన గౌడ కులానికి చెందిన మార్గాని గంగాదరరావుకు కట్టబెట్టడంతో శెట్టిబలిజ కులస్తులంతా ఆయన పై అలిగి అలకపాన్పుపై కూర్చున్నారు. ఇప్పుడు వారి అలకతీర్చే అవకాశం జగ్గిరెడ్డికి లభించింది. వారి అలక తీర్చాలంటే ఎమ్మెల్యే తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి శెట్టిబలిజ కులస్తులకు కట్టబెట్టాలి.ఇప్పుడు ఎమ్మెల్యే అదే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రావులపాలెం లో అదే సామాజిక వర్గానికి చెందిన కుడిపూడి శ్రీనివాస్ జెడ్పిటిసి గా ఉండడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కొత్తపేట మండలానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభ్యర్థి వెదుగులాటలో పడినట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఎంపిక చేసి అభ్యర్థి ఆ సామాజిక వర్థంలో ఉన్న వ్యతిరేకతను చల్లార్చే సమర్థుడై ఉండాలి. అటువంటి వ్యక్తి ఆ సామాజిక వర్గంలో ఎవ్వరూ కనపడక పోవడంతో ఆయన కన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్న రెడ్డి రామకృష్ణ పై పడింది. ఆయన్ని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగినట్లు తేలింది. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తో పాటు, రెండున్నర ఏళ్ళు ఎంపీపీ పదవి కూడా కావాలని షరతు పెట్టినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రామకృష్ణ కుమారుడు మోడేకుర్రు టిడిపి ఎంపీటీసీగా కొనసాగుతున్నాడు. ఎంపిపీ పదవిలో రెండున్నర ఏళ్ళు ఆయన కుమారుడ్ని కూర్చోబెట్టాలని రామకృష్ణ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరాకరించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఆలోచన గంటి మాజీ సర్పంచ్ మట్టపర్తి వెంకట్రావు పై ఉందంటున్నారు. ఆయన ఆ సామాజిక వర్గంలో గౌరవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే రావులపాలెం మండలంలో పలువురు ఆశపడి బంగపడ్డారు. కొత్తపేట మండంలో కూడా వేసి చూసి సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆ సామాజిక వర్థం నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఆయన తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా ఒక్కొక్కరుగా ఆయనకి దూరమౌతున్నారు. మరో ఏడాదిన్నర లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల సమయం తరుముకొస్తున్న తరుణంలో అన్ని వర్గాలను సంతృప్తి పరిచే రీతిలో ముందుకెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఆయన పై ఉంది. ఎవర్నీ ఎంపిక చేసి అధిష్టానం ముందు పెడతారో…? వేచిచూద్దాం.