అనంత‌లోకాల‌కు అతిలోక సుంద‌రి

0
494

బ్ర‌హ్మ‌దేవుడు కొంప‌ముంచాడు. ఎక్క‌డో స్వ‌ర్గ‌లోకంలో విహ‌రించాల్సిన అతిలోక‌సుంద‌రిని ఈ భూమ్మీద పుట్టించాడు. ఉవ్వెత్తున ఎగ‌సే అల చ‌ల్ల‌గా పాదాల్ని స్ప‌ర్శించిన‌ట్లు ఎంత అంద‌మైన న‌వ్వు.

అంద‌మైన ఆ కళ్ల‌లోకి క‌ళ్లు పెట్టిచూస్తే ఒళ్లు పుల‌క‌రించ‌కుండా ఉంటుందా? నాలుగు ద‌శాబ్ధాల‌పాటు సోయ‌గంతో, అభిన‌యంతో కోట్ల హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన మిసెస్ ఇండియా..నువ్వు లేవంటే…నీ అల్ల‌రిని ఇక చూడ‌లేమంటే న‌మ్మ‌గ‌ల‌మా?

ఆ దేవుడెంత స్వార్థ‌ప‌రుడు. త‌న క‌ళ్ల‌ముందు ఉంచుకునేందుకు ఇంత తొంద‌ర‌గా నిన్ను తీసుకుపోతాడా?! మా హృద‌య ఫ‌ల‌కంపై నీ ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం చెర‌ప‌లేనిది…నీ జ్ఙాప‌కం మ‌ర‌పురానిది.