రైతుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు

0
77
  • జిన్నారం లో రైతుల భూములను పరిశ్రమలకు కేటాయిస్తున్న ప్రభుత్వం
  • అడ్డుకున్న రైతులపై పోలీసుల లాఠీ చార్జ్
  • రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వస్తే సహించేదిలేదు
  • రైతుల భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు
  • రైతులకు భూమి ఇచ్చేవరకు పోరాడుతాం
  • కాట శ్రీనివాస్ గౌడ్

జిన్నారం / సంగారెడ్డి, నవంబర్ 15  (నవతరం): జిన్నారం గ్రామంలోని సర్వే నంబర్ 1 లో జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఇదే విషయమై గత కొంత  కాలంగా స్థానిక రైతులు ఆందోళన చేస్తున్నారు. మా భూములు పరిశ్రమలకెలా కేటాయిస్తారంటూ జిల్లా కలెక్టర్ ను సైతం ప్రశ్నిస్తున్నారు. సర్వే నంబర్ 1 లోని రైతుల భూములు పరిశ్రమలకు కేటాయించడం పై మంగళవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతుగా నిలవగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. eఎ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇక్కడి రైతులు గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను పరిశ్రమలకు ఎలా కేటాయిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వడ్డె క్రిష్ణ, ఉప సర్పంచ్ రవి, పుట్టి భాస్కర్, లక్ష్మారెడ్డి, జైపాల్, పటాన్ చెరు ఎస్సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ విషయంపై స్థానిక ఏమ్మార్వో మాట్లాడుతూ మేము రైతుల సాగు భూముల జోలికి వెళ్ళడం లేదు. చట్టప్రకారం సర్వే చేసి కొంత భాగం టీఎస్ఐఐసీ కి కేటాయించాము. కొంత భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో వుంది, కావాలనే కొందరు రాజకీయ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగదు, చట్ట ప్రకారం స్పందిస్తామన్నారు.