రేషన్ కార్డు దారులకు తిప్పలు తప్పవా…

0
149

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అంటే 2019 జూన్ మాసంలో… ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు 92 లక్షల కిలోల కందిపప్పు, 64 లక్షల కిలోల పంచదార, 14 లక్షలు కిలోల గోధుమ పిండి, రెండు లక్షల కిలోల ఉప్పు అందించారు. అయితే 2022 సెప్టెంబర్ మాసంలో బియ్యంతో పాటు 31 లక్షల కిలోల కందిపప్పు, 40 లక్షల కిలోల పంచదార మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డు దుకాణానికి వెళితే బియ్యం తప్ప మరేమీ దొరకవని, రేషన్ కార్డు కావాలంటే ఆఫీసులు, జన్మభూమి కమీటీల చుట్టూ తిరిగినా రావడంలేదని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సీఎం జగన్… తాను అధికారం చేపట్టాక అప్పటి వరకు ఇస్తున్న నిత్యవసరాలకు కోత పెట్టడమే కాక రేషన్ కావాలన్న సచివాలయానికి వెలితే సిబ్బంది దగ. ఇందులో ఇంకా కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది రేషన్ సైట్ పని చేయడం లేదని సమాధానం వస్తుంది. చంద్రబాబు సర్కార్ లో ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ లో అంతకు మించి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో రేషన్ కార్డుదారులు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి ఏ గత పట్టిందో అదే గతి జగన్మోహన్ రెడ్డి కి ఆశ్చర్యం లేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.