నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

0
72

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 10 (నవతరం): ఆర్ వై రవళి రోలర్ స్కేటింగ్ సెంటర్ లో స్కేటింగ్ శిక్షణ పొంది అందులో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్ గూడ లో రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల నుండి ఢిల్లీలో జరిగే  నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు క్రీడాకారులు. తేదీ  6 జనవరి 2023 నుండి 8 జనవరి 2023 వరకు రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దలు కె.ఎం.ప్రతాప్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా బొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ నేషనల్ ఐస్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించి, వారికి మిఠాయిలను తినిపించారు. నేషనల్ పోటీలలో కష్టపడి పథకాన్ని సాధించాలన్నారు. వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మాణిక్య నగర్, చింతల్ ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులు బిజిలి విజయ్ కుమార్, సాయి తనీష్ రెడ్డి, వరుణ్ రాజ్, లిటిల్ స్కాలర్ స్కూల్ నుండి హర్ష, జోషిత నేషనల్  ఐస్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ వై రవళి రోలర్ స్కేటింగ్ సెంటర్ కోచ్ జి రవళిక, లిటిల్ స్కాలర్ స్కూల్ కోచ్ మహమ్మద్ తాహిర్ అలీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బిజిలి కృష్ణ, కె.వి రమణారెడ్డి, బాలరాజ్, రామ్ విలాస్ సింగ్, చందర్రావు, రమేష్, అచ్చిబాబు, లక్ష్మణ్ ,స్కేటింగ్ క్రీడాకారుల తల్లిదండ్రులు చంద్రకళ, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.