దేేేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు….

0
302

నవతరం, భీమవరం; ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని వాటి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని దెయ్యాల తిప్ప గ్రామంలో రూ 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఇప్పటికే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మించామని అన్నారు .మరి కొన్ని గ్రామాలలో ఈ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యంన్ని తీసుకురావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన సచివాలయాలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి రేషన్ కార్డులు, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు ఇలా సుమారు 570 రకాల సేవలను అందిస్తున్నామని అన్నారు. గతంలో అయితే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వీటి కోసం ప్రజలు కాళ్లరిగేలా తిరిగే వారని గుర్తు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ప్రతి 50 కుటుంబాలకు వలంటీర్లను నియమించి సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఒకటో తారీకు వేకువజామునే పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు అందించడం జరిగిందని అన్నారు. యనమదుర్రు డ్రెయిన్ పై నిర్మించిన వంతెన లకు రూ 30 కోట్ల పైగా నిధులతో అప్రోచ్ రోడ్లను నిర్మిస్తున్నామని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమణి ఏడుకొండలు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహ రాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, తాసిల్దార్ ఏ వి రమణ రావు, ఎంపిడిఓ జి పద్మ, అంగన్వాడి ప్రాజెక్టు అధికారి వాణి విజయ రత్నం, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ నరసింహ స్వామి తదితరులు పాల్గొన్నారు.