
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) & టీమ్ ARK సంయుక్త ఆధ్వర్యంలో 60 పేద కుటుంబాలకు చలి దుప్పట్లను పంపిణీ…
నవతరం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) &టీమ్ ARK సంయుక్త ఆధ్వర్యంలో తణుకు మండలం దువ్వు గ్రామంలో తానా మ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా గారి సౌజన్యంతో 60 పేద కుటుంబాలకు చలి దుప్పట్లను తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మరియు దువ్వ గ్రామ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా అరిమిల్లి మాట్లాడుతూ తానా మరియు టీమ్ ARK ఆధ్వర్యంలో భవిష్యత్ లో కూడా ఇలాంటి సేవకార్యక్రమలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షులు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సిరిగిశెట్టి వెంకటేశులు, పోతుల సత్యనారాయణ, కట్ట సూర్యారావు, బొరుసు సత్యనారాయణ, ఆలపాటి కాశీ, కాకి రాముడు, కొండేటి శివ, పత్తి రామకృష్ణ, చేకూరి ప్రసాదరాజు , ఇడుపుగంటి జగదీష్, రుద్ర సత్యనారాయణ, గిద్ద దనరాజు, ఆలపాటి వెంకట్రావు కేదార్ రాము, మైపాల నాగయ్య మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

