- తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం
- టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ప్రమాణ స్వీకారం
- భారీ ఎత్తున హాజరైన తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు
- తెలంగాణలో టీడీపీ కి పూర్వ వైభవం రావాలన్న చంద్రబాబు
- అభివృద్దికి మరోపేరు చంద్రబాబు నాయుడన్న కాసాని
- గ్రామ గ్రామాల నుండి భారీగా తరలివచ్చిన యువత, ప్రజలు
- పేద, అణగారిన వర్గాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు..
- ముదిరాజులకు రాత్రింబవళ్ళు సేవలందించిన వ్యక్తి కాశాని: చంద్రబాబు
- కాసాని జ్ఞానేశ్వర్ సేవలను కొనియాడిన టీడీపీ అధినేత
- కాసాని జ్ఞానేశ్వర్ నీతి నిజాయితీకి మారుపేరన్న బాబు
- తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీద
- తెలుగువారి ఆత్మగౌరవం కొరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎక్కడా లేని విధంగా కరతాళ ధ్వనులతో.. జై టీడీపీ, జై కాసాని, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేశారు సభా ప్రాంగణంలో వున్న జనం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మారుమూల గ్రామాల నుండి వెల సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో వాహణదారులకు సుమారు నాలుగు గంటల పాటు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సభలో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ తెలంగాణ గడ్డమీద పుట్టిన పార్టీ, ఇది తెలుగువారి పార్టీ అంటూ టీడీపీ ఆవిర్భావం, టీడీపీ సాధించిన ఘనత, సామాన్య మానవుడికి టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ల హక్కులు, రిజర్వేషన్ ల కొరకు టీడీపీ చేసిన పోరాటాలు, సాధించిన ఘనతను గుర్తు చేశారు. బీసీల ప్రాధాన్యతను గుర్తు చేసిన ఆయన నేడు ఒక బీసీ నాయకుడు తెలంగాణ అధ్యక్షుడుగా ఎదిగిన విషయాన్ని ఒక గొప్ప ఘట్టంగా అభివర్ణించారు. ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందని, చిందర వందర అయిన టీడీపీ క్యాడర్ ను తిరిగి ఒక దగ్గర చేర్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తానని, తనపై నమ్మకముంచి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పినందుకు అధిష్టానానికి, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
(ఎల్లంపల్లి, బ్యూరో చీఫ్ – తెలంగాణ రాష్ట్రం, నవతరం)
హైదరాబాద్, నవంబర్ 10 (నవతరం): తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు. టీ టీడీపీ అధ్యక్షుడిగా ఈ నెల 4న కాసానిని నియమిస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని చంద్రబాబు నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు కాసాని తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన… తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తానని ప్రమాణం చేశారు. హైదరాబాద్ నడిబోడ్డుననే టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని ఈ సందర్భంగా కాసాని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే క్రమశిక్షణ అని… క్రమశిక్షణ అంటే చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధే పార్టీ శ్రేణులకు ఎజెండా అన్న కాసాని… చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేళల్లో హాజరైన జనం కాసాని జ్ఞానేశ్వర్ కు శుభాభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి హాజరైన జనం టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తిరిగి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని పార్టీ నాయకులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక ముద్ర వేసుకున్న కాసాని.. ముదిరాజ్ యువతను ఏకతాటిపై నడిపిస్తూ తన మార్క్ ను చాటుకున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని పార్టీ అధినేత సూచనల మేరకు, తప్పకుండా సామాన్య మానవుడు అభివృద్ది చెందేవరకు కష్టపడతానని ఆయన అన్నారు. పార్టీ అభివృద్ది కొరకు గ్రామ గ్రామాన తిరిగి పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఒకకతాటిపైకి తీసుకువస్థానని ఆయన అన్నారు.
పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలి: చంద్రబాబు
దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా ఎదగడానికి పునాది వేసింది తెలుగు దేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీలో చూస్తే తెలుగువాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెదేపా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డమీద పుటయిందని, తెలుగు జాతి అభివృద్ది కొరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. ఆర్థిక అసమానతలు పోయేవరకు టీడీపీ పనిచేస్తూనే వుంటుందని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు. రాజకీయాలకు కొత్త అర్థమిచ్చినవారు ఎన్టీఆర్ అన్నారు. పాలలను పేదవాడి ఇంటిముందుకు తీసుకువచ్చి, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించానన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన కాసాని జ్ఞానేశ్వర్ గురించి మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా పదవికి వన్నె తెచ్చే వ్యక్తి కాశాని అన్నారు. టెక్నాలజీలో చూస్తే తెలుగువాళ్ళు బాగా రాణిస్తున్నారని, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు వచ్చాయన్న ఆయన భాగ్యనగరంలో లాండ్ విలువ బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు కేవలం రంగారెడ్డిలోనే 200 కళాశాలున్నాయని, తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్దికి నాంది పలికిందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వ టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఇతర సభ్యులతో చర్చించి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటివరకు టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న బక్కని నర్సింహులు పొలిట్ బ్యూరో లో స్థానం కల్పించారు. అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో తెలుగు తమ్ములు సరైన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామగ్రామాన తిరిగి పూర్వ క్యాడర్ ను ఏకం చేస్తానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సారి టీడీపీ విజయం సాధించబోతుందని ఆశాభావం తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ది కొరకు టీ టీడీపీ పాటుపడుతుందని తెలియజేశారు కాసాని జ్ఞానేశ్వర్.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలిన జనం 
కార్యక్రమంలో మాట్లాడుతున్న నాయకులు 


కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత 
కార్యక్రమంలో మాట్లాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 
టీడీపీ అధినేతతో కాసాని 
సభలో చంద్రబాబు నాయుడు 
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు 
పార్టీ అధినేత, టీటీడీపీ అధ్యక్షుడిని గజమాలతో సత్కరిస్తున్న నాయకులు 

టీటీడీపీ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ 
వేలాదిగా తరలివచ్చిన లంబాడీ యువతులు, కార్యకర్తలు 
ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాసాని జ్ఞానేశ్వర్

