జిల్లా కలెక్టర్ ని కలిసిన ‘జేడీ ఫౌండేషన్’

0
152

భద్రాద్రి జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన “జేడీ ఫౌండేషన్”


స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ, జాతీయ స్థాయిలో 3వ స్థానం భద్రాద్రి కొత్తగూడెం నిలిచిన సందర్భంగా, జేడీ ఫౌండేషన్ భద్రాచలం ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ ని మర్యాద పూర్వకముగా కలిసి, జేడీ ఫౌండేషన్ తరపున శుభాకాంక్షలు తెలిపి, శాలువా, పూలమొక్క, సీతారాముల ప్రతిమతో సత్కరించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ 2018 నుండి ప్లాస్టిక్ నిషేధం చేస్తున్న కృషి ని గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగింది, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం అందరి సమిష్టి కృషి తోనే సాధ్యమైనది అని, అలాగే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని, తప్పకుండా జేడీ ఫౌండేషన్ ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు హన్సి,కడాలి నాగరాజు, యూసుఫ్ మియా, వేమూరి పవన్ తదితరులు పాల్గొన్నారు.