జంతువుల కొవ్వుతో నకిలీ వంట నూనె కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు…

0
112


నవతరం, ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం శివారులో అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావు అదేశాలతో ఎస్సై లక్మి కాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీకి కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నకిలీ ఆయిల్ తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను, తయారీకి ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . అక్రమ ధనార్జన ధ్యేయంగా ఎఫ్.కే పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్, ధర్మవరం గ్రామ శివారున జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి, ఇచ్చాపురంకి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్, యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ ,రాజమండ్రికి చెందిన యం.డి ఇఫ్రాన్ లతో ఒప్పందం కుదుర్చుకొని గత నాలుగు నెలలుగా ఆప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీ హరి రాజు తెలిపారు. నిందితుడితో పాటు మరో 8మంది ఈ అక్రమ దందాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై లక్ష్మీకాంతం వారి సిబ్బందిని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు. ప్రజలు నకిలీ పదార్థాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని డిఎస్పీ శ్రీహరి రాజు హెచ్చరించారు. ఇలాంటి కల్తీ వ్యాపారాలు చేసే వారిని ప్రజలు తమకు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించకపోతే వారి చేసే కల్తీ మన వరకు వస్తుందనీ , మన ఆరోగ్యం కోసమైనా కల్తీని నిరోధించడానికి మన వంతు కృషి చెయ్యాలని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here