నవతరం, రౌతులపూడి.రౌతులపూడి మండల పరిషత్ కార్యాలంలో ప్రకాశం పంతులు జయంతి. నిరాడంబరుడు, స్వార్థపరుడు, సంఘ సంస్కర్త జనోద్ధరణకు అహర్నిశలు శ్రమించిన మహనీయుడైన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు యొక్క 129 వ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి ఎస్ వి నాయుడు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం లోనూ పాఠశాలలోనూ ప్రకాశం పంతులు యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఎస్. వి. నాయుడు మాట్లాడుతూ ఆనాడు మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన గనులు ప్రకాశం పంతులుగారు అని కొనియాడారు. ఆంధ్ర ప్రజల ఆకుంటిత ధైర్యసాహసాలకు, ఆంధ్రుల అసమాన త్యాగనిరతికి మారుపేరని కొనియాడారు.1872 ఆగస్టు 23 న జన్మించారు. తన సర్వస్వాన్ని దేశ ప్రజల కోసం ధారపోసిన మహనీయుడని ఎండిఓ కొనియాడారు. అంతేకాక నమ్మిన వారే ఆయనను మోసం చేశారని ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో ప్రకాశం పంతులు తన న్యాయవాది వృత్తిని విడిచి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన గుంటూరులో హైకోర్టును, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నెలకొల్పారు. మరియు కేంద్ర ప్రభుత్వ అనుమతులు మంజూరు కోసం వేచి చూడకుండా విజయవాడ లో కృష్ణా బ్యారేజ్ నిర్మించారు. దీనితో ఈ రోజుకు కూడా అనేక ప్రాంతాలు సస్యశ్యామలంగా అన్నపూర్ణగా పేరుగాంచిన అన్నారు. ప్రకాశం పంతులు జీవితం ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు తమ జీవితానికి అన్వయించుకోవాలి ఈ సందర్భంగా ఎంపిడిఓ ఎస్ వి నాయుడు ఆకాంక్షించారు ప్రకాశం పంతులు యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు