పెద్దవంగర, అక్టోబర్27( నవతరం): మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన గిరగాని అంజయ్య ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుండి కిందపడి తీవ్ర గాయాలైయ్యాయి. గురువారం గీత కార్పొరేషన్ నుండి రూ.15 వేల చెక్కును గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న గౌడ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాది మందికి ఉపాధిని కల్పించే కల్లుగీత వృత్తిని ఆధునీకరించే చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని, అర్హులైన గీతా కార్మికునికి ప్రతి నెల 3000 పింఛన్ ఇవ్వాలన్నారు. గీత కార్మికులకి తాత్కాలిక ఎక్స్ గ్రేషియా లక్ష రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం వలె, గీత కార్మికుల సంక్షేమ కొరకు గీత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో గీతా సొసైటీ అధ్యక్షుడు రాచకొండ వెంకన్న, సొసైటీ సభ్యులు పొడిశెట్టి రామచంద్రు, అంజయ్య, యాకయ్య, మల్లయ్య, శ్రీనివాస్, ఐలయ్య, శ్యామ్, పొడిశెట్టి సమ్మయ్య పాల్గొన్నారు.

గీత కార్పొరేషన్ నుండి రూ.15 వేల చెక్కును అందజేస్తున్న గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్

