ఆ హీరో భార్య హీరోయిన్ కాబోతోంది!

0
628

బాలీవుడ్ హీరో షాహిద్‌ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ వెండితెర‌పై మెర‌వ‌బోతోంది. యువ హీరో సిద్ధార్థ మల్హోత్రా సరసన హీరోయిన్‌గా నటించేందుకు మిసెస్ షాహిద్‌క‌పూర్ అంగీక‌రించింద‌ని స‌మాచారం.

డీహెచ్‌ లారెన్స్ న‌వ‌ల ‘లేడీ చాలర్ల్సీ లవర్‌’ ఆధారంగా హిందీలో తెరకెక్కబోతున్న సినిమాలో మీరా రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తార‌ని చెబుతున్నారు.


నేహా ధూపియా టాక్‌షోలో పాల్గొన్న మీరా రాజ్‌పుత్‌… సంజ‌య్‌లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని పేర్కొంది. అదే షోలో మాట్లాడిన షాహిద్‌క‌పూర్‌ కూడా సిద్ధార్థ మల్హోత్రా నటనంటే త‌న భార్య‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు.

మీరా రాజ్‌పుత్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయ‌బోతున్న సిన్మాలో షాహిద్‌ కూడా అతిథి పాత్ర పోషించే అవకాశముంద‌ని స‌మాచారం. మొత్తానికి మీరా బాలీవుడ్‌లో అడుగుపెడుతుండ‌టంతో షాహిద్ ఆనంద‌ప‌డుతున్నాడు. తెర‌మీద కూడా ఫ్యూచ‌ర్‌లో ఈ యంగ్ క‌పుల్ జంట‌గా క‌నిపిస్తారేమో!