అడ్డంగా బుక్కైన ష‌మి

0
462

క్రికెటర్ మహ్మద్ షమి కెరీర్ క్లీన్‌బౌల్డ్ అయ్యేలా ఉంది. టీమిండియా స్టార్ బౌలర్‌పై గృహహింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయ్…ఇప్పటికే బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన షమి నెత్తికి కొత్త క‌ష్టాలు చుట్టుకుంటున్నాయి.

తనను చిత్రహింసలు పెడుతున్నారనీ, షమి మోసగాడనీ, అమ్మాయిలతో సంబంధాలున్నాయనీ ఆరోపణలు చేస్తున్న అతని భార్య హసీన్ జహాన్…ఇప్పుడు మరింత తీవ్రమైన ఆరోపణలు చేసింది…తనను చంపి మరో అమ్మాయిని షమి పెళ్లి చేసుకోవాలన్నాడనీ,పాకిస్తానీలతో కలిసి కొన్ని మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కి భర్త ప్రయత్నించాడ‌ని ఆరోపిస్తోంది ష‌మి భార్య‌ జహాన్.

షమి భార్య హసీన్ జహాన్ ఫిర్యాదుతో కోల్‌కతాలో కేసు నమోదైంది.టీమిండియా తరపున 30 టెస్టులు, 50 వన్డేలు ఆడిన ష‌మి ఇంటి గొడ‌వ‌తో టీమిండియా కాంట్రాక్ట్‌ని కూడా చేజార్చుకున్నాడు..కేసుల వ్యవహారం కొలిక్కి వచ్చేదాకా టీమిండియాలో అత‌నికి చోటు దక్కదు. భార్య ఆరోపణలన్నీ అబ‌ద్ధాలంటున్నాడు ష‌మి. అయితే అత‌ని వాద‌న‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మ‌రోవైపుఉ షమితో రాజీపడేదే లేదంటున్న భార్య అతన్ని కోర్టుకు ఈడుస్తానంటోంది. దీంతో కేసు వ్యవహారం తేలేదాకా , ఏ ఫార్మాట్‌లోనూ షమి ఆడే అవకాశం లేదు.

క్రికెట‌ర్ల ఇళ్ల‌లో వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు అంద‌రిలాగే స‌ర్వ‌సాధార‌ణ‌మైనా ష‌మి అనుభ‌వం గ‌తంలో ఏ క్రికెట‌ర్‌కీ ఎదురు కాలేదు. పైగా ష‌మిని బ‌ట్ట‌లిప్పి బ‌జార్లో నిల‌బెట్టాల‌న్నంత ప‌ట్టుద‌ల‌తో అత‌ని భార్య ఉండ‌టంతో ఈ క్రికెట‌ర్ భ‌విష్య‌త్తు భ్ర‌ష్ఠుప‌ట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ వివాదాల నుంచి ష‌మి ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ‌తాడో..లేదంటే మ‌రింత లోతులో కూరుకుపోతాడో చూడాలి మ‌రి.