నవతరం, భీమవరం: శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల వెంకేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం.
నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డారని అన్నారు. ఉండపల్లి రమేష్ నాయుడు మరియు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినదని అన్నారు.
భట్టిప్రోలు శ్రీనివాస్,గంటా సుందర కుమార్ తదితరులు మాట్లాడుతూ 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారని కొనియాడారు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉండపల్లి రమేష్ నాయుడు,అరసవల్లి సుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాస్, గంటా సుందర కుమార్, సింగం శెట్టి వెంకటేశ్వరరావు, నరహరి శెట్టి కృష్ణ, అభిమానులు తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.