- దమ్ము పేటలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు
- దళిత బంధు తరహా కూలి బంధు ఇవ్వాలి
- అమలైన జూనియర్ కాలేజీ వెంటనే ప్రవేశపెట్టాలి
- కబ్జాలో ఉన్న 44 ఎకరాల భూమిని నిరుపేదలకు పంచాలి
- డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు ఏర్పాటు చేయాలి
- రేషన్ కార్డులు జారీ చేయాలి
- ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా చేయలేని పనులు ఉన్న ఒక్క సంవత్సరంలో చేస్తుందనే నమ్మకం లేదు
- సిపిఐ దమ్మపేట కమిటీ డిమాండ్
అశ్వరావుపేట, అక్టోబర్ 17 (నవతరం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో వివిధ ప్రజా సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం దమ్మపేట ఉప తాసిల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ, దమ్మపేట మండలంలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తదరంగా ఉందని, ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావస్తుందని, ఇంకొక సంవత్సరం ఈ ప్రభుత్వానికి గడువు ఉన్నదని, ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేయని పనులు ఈ సంవత్సరంలో చేస్తారనే నమ్మకం లేదని, మాటల చెప్పి కాలాన్ని వెల్లబుచ్చుతున్న పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని, ఇల్లు లేని నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షలు ఇవ్వాలని, గత తొమ్మిది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఊసే లేదని, పుట్టిన పిల్లలకు ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయని, కొత్తగా పెళ్లయిన 8 సంవత్సరాలు అవుతుందని కానీ వారికి రేషన్ కార్డు లేవని, ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని, దళిత బంధు తరహాలో కూలి బందు ప్రవేశపెట్టి ప్రతి కూలి చేసుకునే కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని, గిరిజన బంధు వెంటనే అమలు చేయాలని, దమ్మపేట కి జూనియర్ కాలేజీ మంజూరై సంవత్సరం అయిందని, పోయిన మార్చిలోనే క్లాసులు ప్రారంభిస్తామని కానీ దాని ఉసే లేదని, తక్షణం జూనియర్ కాలేజీ క్లాసులు ప్రారంభించాలని, దమ్మపేట ,నల్లకుంట సర్వే నెంబర్ 273లో సుమారు 44 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండదని, దాన్ని కొంతమంది కబ్జా చేశారని, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడున్న గిరిజనులకు పంచాలని, దమ్మపేట శివారు మల్లారం గ్రామం అవతల సుమారు 120 మంది ఎనిమిది నెలల క్రితం నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురం ఉంటున్నారని, వారికి మంచినీటి సదుపాయం కరెంటు సదుపాయం కల్పించాలని , పెరిగిన నిత్యవసర వస్తువుల రేట్లు తగ్గించాలని, చౌక ధర డిపోలలో బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, నూనె, చింతపండు తదితర నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తంగెలమూడి శివకృష్ణ, సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, బత్తుల సాయి, దొంగ లక్ష్మీనారాయణ, తుపాకుల శాంతి, జానీబేగం రాపోలు శివన్నారాయణ, నక్క నాగమణి, జాన్ బి, కోకిలంపాడు వెంకటేశ్వరరావు, అద్దం విజయలక్ష్మి, బెల్లం కృష్ణవేణి, వీరలక్ష్మి కుంజా కృష్ణవేణి, కుమారి, అంజలి, గాజుబోయిన కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.



