పాపన్నపేట, అక్టోబర్ 28 (నవతరం): టిఆర్ఎస్ పిలుపుమేరకు బిజెపి తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ (బిఆర్ఎస్) ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గురువారం పాపన్నపేటలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెదక్ బోడుమాటిపల్లి రహదారిపై మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, బాబా గౌడ్, మీడియాతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని దమ్ముఎవరికీ లేదని టిఆర్ఎస్ పార్టీ అంటే అమ్ముడు పోయేది కాదు తెలంగాణ కోసం పోరాడిన టిఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీలో ఉన్న కార్యకర్తలని కూడా కొనలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కిష్టా గౌడ్, ఉప్పరి వెంకటేష్, శ్రీనాధ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆంటోనీ, బెస్త బాలరాజు, జకేర్, సొంగ దుర్గయ్య,సంగప్ప, ఫుల్సింగ్, క్యాస గళ్ళ మహేందర్, రాజ్, కృష్ణ, ప్రసాద్, ఆంజనేయులు, మన్సూర్ తదితరులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


