నోరు పారేసుకున్న ప్రతిపక్షం…. చేతలకు దిగిన అధికార పక్షం…

0
471

నోరు పారేసుకున్న ప్రతిపక్షం…

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశంలో అది కూడా లైవ్ లో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. టిడిపి అధికారం కోల్పోయిన నాటి నుంచి కాస్త దురుసుగా మాట్లాడం అలవాటుగా చేసుకున్నారు. సాధారణంగా ప్రతిపక్షం అంటే ప్రభుత్వం పై విమర్శలు చేయడం సర్వసాధారణం ఆ విమర్శలు కాస్త ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో వ్యక్తి గత దూషణలకు దారితీస్తున్నాయి. అసలు విషయానికి వస్తే నిన్న పట్టాభి లైవ్ లో ముఖ్యమంత్రిని అరే వరే సన్నాసి లాంటి అనకూడని మాటలు అంటూ ఘాటుగా మాట్లాడారు.

చెయ్యికి పని చెప్పిన పాలకపక్షం..

రాజకీయ పార్టీలు అంటేనే విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం. అలాంటిది ఈ మధ్యకాలంలో తిట్ల దండకాల వరకూ వెల్లింది. టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి పై తిట్ల దండకం అందుకోవడంతో మా ముఖ్యమంత్రిని తిడతావా అంటూ వైసిపి శ్రేణులు పట్టాభి ఇంటితో పాటు టిడిపి ప్రధాన కార్యాలయం, రాష్ట్రంలో ఉన్న జిల్లా టిడిపి కార్యాలయలపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో పలుచోట్ల కారు అద్దాలు కిటికీ అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.

రాష్ట్రంలో ఉన్న పాలక ప్రతిపక్షాలు రెండూ కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా అవసరాలు గాలికొదిలేసి వ్యక్తి గత స్వార్థ ప్రయోజనాల, అధికారం కోసమే పని చేస్తున్నాయని వాస్తవానికి ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకుని రాబోయే తరాలకు దిక్క్చూసి లా ఉండకుండా ఇప్పటి నాయుకులు రేపటి తరాలకు తిట్ల దండకం నేర్పడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఉంది. ఏదిఏమైనా నిన్న జరిగిన సంఘటన చూస్తే వాటి పరిది దాటి రాజకీయ పార్టీలు ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి అధికార పక్షం తప్పు చేస్తే విమర్శ చేయ్యాలి తప్ప నోరు పారేసుకోవడం సరికాదు. అలాగే ప్రతి పక్ష నాయుకులు నోరు జారితే ప్రభుత్వం చేతిలో పోలీసు యంత్రాంగం ఉంది, కోర్టులు చట్టం అన్ని ఉండగా ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై దాడులు వంటి దురదృష్టకర సంఘటనలు జరుగుకుండా పోలీసులు నిలువరించే
ప్రయత్నం చెయ్యాలని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, మేధావులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
పట్టాభి అనకుడాని మాటలకు కోపోద్రేకులేయిన పాలకపక్షం వారు సహణం కోల్పోయి ప్రవర్తించడం దురదృష్టకరం,