ట్రంప్ బ‌తుకు కంపు కంపు!

0
524

చ‌ప‌ల‌చిత్తంతో చేసిన చిల్ల‌ర‌ప‌నులు అమెరికా అధ్య‌క్షుడి ప‌రువుని రోడ్డ‌మీదికి ఈడుస్తున్నాయి. నీలిచిత్రాల న‌టీమ‌ణితో ట్రంప్ అప్పుడెప్పుడో సాగించిన రాస‌లీల‌ల ఎపిసోడ్ డెయిలీ సీరియ‌ల్‌లా సా..గుతూనే ఉంది. డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్లు అన్నీ డీటైల్డ్‌గా చెప్పేసింది పోర్న్‌ స్టార్ స్టామీ డేనియల్స్. ఓ ప్రైవేట్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదీ దాచుకోకుండా అన్నీ పూస‌గుచ్చిన‌ట్లు చెప్పేసింది. ఈ ఇంట‌ర్వ్యూ అగ్ర‌రాజ్యంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

స్టామీ డేనియ‌ల్స్ చెప్పిన న‌గ్న స‌త్యాల‌తో ట్రంప్ ఎదురైతే మొహాన ఊసేలా ఉన్నారు కొంద‌రు అమెరిక‌న్లు. అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకుని కుని ఇన్నాళ్లూ త‌న‌ నోరు కట్టేశార‌నీ.. ఎక్కడైనా బయటపెడితే అంతు తేలుస్తామ‌ని బెదిరించార‌ని చెప్పింది ఆ పోర్న్‌స్టార్‌. అన్నీ చెప్పేస్తానంటూ ట్రంప్‌తో తన అఫైర్ గురించి గంట సేపు జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్మార్టీ డేనియల్స్. శృంగారంలో పాల్గొనాల‌ని ట్రంప్ తొలిసారి ఒత్తిడి తీసుకొచ్చిన‌ప్పుడు స్మార్టీ డేనియల్స్ వ‌య‌సు 27 ఏళ్లైతే.. ట్రంప్‌కు ద‌గ్గ‌ర‌ద‌గ్గ‌ర ఆరుప‌దుల వ‌య‌సు.

ఎక్క‌డ త‌న బాగోతం బ‌య‌ట‌పెడుతుందోన‌ని స్టామీ డేనియ‌ల్స్‌ని ట్రంప్ బెదిరిస్తూనే వ‌చ్చాడు. ట్రంప్‌తో తన సంబంధం గురించి అధ్యక్ష ఎన్నికల ముందు బయటపెట్టాలనుకున్నప్పుడు ఆయ‌న లాయర్లు వచ్చి..అగ్రిమెంట్ చూపించి బెదిరించారని..అయితే అగ్రిమెంట్‌పై ట్రంప్‌ సంతకం చేయకపోవడంతో అది చెల్లదంటోంది స్టామీ డేనియ‌ల్స్‌. అమెరికా అధ్యక్షుడితో వివాహేతర సంబంధం గురించి గతంలోనూ ఓ ప్లేబోయ్ మేగజైన్ మోడల్ ఇలాంటి ఆరోపణలే చేసింది. ఒక‌రంటే దురుద్దేశంతో చేశార‌నుకోవ‌చ్చు. ట్రంప్ ఎంత తేడానో చూస్తుంటేనే తెలిసిపోవ‌డంలేదూ..