ఎంత స‌క్క‌గున్నావే…

0
485

మొద‌టి సిన్మాతోనే కుంద‌న‌పుబొమ్మ అనిపించుకుంది. టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోలంద‌రితోనూ న‌టించింది. మూడు త‌రాల అక్కినేని కుటుంబ సిన్మాలోనూ అంతా త‌నైంది. చివ‌రికి అక్కినేనివారింట కోడ‌లిగా అడుగుపెట్టి అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచు అవ‌తార‌మెత్తింది. పెళ్ల‌య్యాక న‌టిస్తున్న తొలి సిన్మాలోనూ అద్భుత‌మైన అభిన‌యంతో అంద‌రి గుండెల్లో గిలిగింత‌లు పెడుతోందీ ముద్దుగుమ్మ‌.
లంగావోణితో ప‌ల్లెటూరి రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో జీవించేస్తోంది స‌మంతా. ఫ‌స్ట్‌లుక్‌, రెండు టీజ‌ర్ల‌తోనే అంతా త‌న కోసం ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసుకుంది అక్కినేనివారి కోడ‌లు. సుకుమార్ డైరెక్ష‌న్‌లో రాంచ‌ర‌ణ్‌, స‌మంతా జంట‌గా న‌టిస్తున్న రంగ‌స్థ‌లంలో హీరోయిన్‌గా స‌మంతా స్టిల్స్ అంద‌రిలో తెగ ఇంట్ర‌స్ట్ పెంచేస్తున్నాయి. ఇప్ప‌టికే ఎంత స‌క్క‌గున్నావే అంటూ మొద‌ల‌య్యే పాట‌కు చిందులేశారు చిట్టిబాబు(చ‌ర‌ణ్‌), రామ‌ల‌క్ష్మి(స‌మంతా).


ఎంత స‌క్క‌గున్నావే..

మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న రంగ‌స్థ‌లం సిన్మాకు దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ష‌న్ అందిస్తుండ‌టంతో ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో పాట‌లు దుమ్ము రేప‌బోతున్నాయి. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రి క్యారెక్ట‌ర్ల‌కూ విప‌రీత‌మైన రెస్పాన్స్ రావ‌టంతో మార్కెట్‌లో ఈ సిన్మాకి హైప్ పెరుగుతోంది. మార్చి 30న ప్రేక్ష‌కుల ముదుకు రానున్న రంగ‌స్థ‌లం రిలీజ్ లోపు ఇంకెంత ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేయ‌బోతోందో!