
నవతరం, అంబాజీపేట: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ (ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) ఆక్రిడేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన పళ్ల సూర్యప్రకాశరావు (బాబ్జి)ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. అంబాజీపేటలో బాబ్డిని దుశ్చాలువాతో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా వార్తా కధనాన్ని వెల్లడించే విలేకరి వృత్తి కత్తిమీద సాములాంటిదన్నారు. ప్రజాస్వామ్యంలో విలేకరి సేవలకు వెలకట్టలేనిదన్నారు. అనంతరం నూతనంగా అక్రిడేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన బాబ్జిని ఎమ్మెల్యే సత్కరించి, అభినందించారు. బాబ్జి మాట్లాడుతూ తనకు అక్రిడేషన్ కమిటీలో సభ్యునిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వెంకట్రావు, కార్యదర్శి జి. ఆంజనేయులు, నేషనల్ ఎలయెన్స్ ఆఫ్ జర్నలిస్ కార్యదర్శి వాతాడా నవీన్రాజ్, రాష్ట్ర కోశాధికారి మట్టపరి శ్రీనివాస్, నాయకులు సమయమంతుల హరిప్రసాద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాబ్జిని అబినందించిన వారిలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ పబ్బినీడి రాంబాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి పెదబాబు, మట్టపర్తి హరి, పత్తి దత్తుడు తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు.
===

