పోలీసుల మెగా రక్తదాన శిబిరం….

0
349


భీమవరం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలలో భాగంగా 28వ తేదీన స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వన్ టౌన్తణఘై సిఐ ఆళ్ళ కృష్ణ భగవాన్ తెలిపారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మెగా రక్తదాన శిబిరానికి సంబంధించి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. పోలీస్ అమరవీరుల వారోత్సవం ముగింపులో భాగంగా 28వ తేదీన నిర్వహించే రక్తదాన శిబిరాన్ని నరసాపురం డిఎస్పి టీ. వీరాంజనేయ రెడ్డి ప్రారంభించనున్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, పోలీసుల ఆధ్వర్యంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు Asn రాజు చారిటబుల్ ట్రస్ట్, ఎస్ ఎల్ డి స్పెషాలిటీ లాబ్స్ ల ఆధ్వర్యంలో సేకరిస్తున్న రక్తదాన శిబిరంలో రక్త దాతలకు ఒక హెల్త్ చెకప్ కూపన్ ఇవ్వడం జరుగుతుందని ట్రస్ట్ అధినేత అల్లూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. కూపన్ ద్వారా సుమారు రెండు వేల రూపాయల విలువ గల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందని వాటిని రక్త దాతలు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవచ్చునని పరీక్షలను వరల్డ్ డయాబెటిస్ ‘డే’ నవంబర్ 14వ తేదీ సందర్భంగా అప్పటినుండి డిసెంబర్ 15 వ తేదీ వరకు కూపన్ ను వినియోగించు కోవచ్చు అలాగే NBTC నిబంధనల ప్రకారం ప్రతి రక్తదాత కు బ్లడ్ గ్రూప్, మలేరియా ,విఆర్ డియోల్,హెచ్బీఎస్ ఏజీ, హెచ్ఐవి, హెచ్ సి వి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ ఐ లు వి వెంకటేశ్వరరావు, వై నాగలక్ష్మి, డాక్టర్ అల్లూరి గౌతమ్, నరహరిశెట్టి క్రృష్ణ, కొండ్రు శ్రీనివాస్, ఏ ఎస్ ఐ దాలయ్య హెడ్ కానిస్టేబుల్ రాజు, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.