పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి పిచ్చుకల సంతతిని కాపాడుకుందాం… సిఆర్పిఎఫ్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ అంకారావు

0
46


నవతరం, పెదకూరపాడు: పిచ్చుకల గూళ్లను ఏర్పాటు చేసి పిచ్చుకల సంతతిని కాపాడుకుందామని అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ జిల్లా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ (సిఆర్పిఎఫ్) ఇంటూరి అంకారావు అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులోని జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో శుక్రవారం పక్షులకు నీరు,పక్షులకు గిన్నెలలో ఆహారం, పక్షులగూళ్ళుపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుచేసిన పోస్టర్లను సబ్ ఇన్స్పెక్టర్ అంకారావు సంస్థ ప్రతినిధులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు పక్షులు విలవిలలాడుతున్నాయని పక్షులకు గిన్నెల్లో నీరు పోసి, గింజలు వేస్తే వాటి ప్రాణానికి ఊపిరి పోసిన వారమవుతామని అన్నారు. సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు కల్పిద్దామని, పక్షుల కోసం గూళ్ళను ఏర్పాటుచేసి నీటిని, ఆహారాన్ని అందుబాటులో ఉంచుదామన్నారు. జనచైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పెదకూరపాడులో మూడు ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నమని, పక్షుల కోసం కూడా గూళ్ళను, గిన్నెలో నీటిని, ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య సమితి ప్రతినిధులు షేక్ సుభాని, గుడిపూడి బ్రహ్మనాయుడు, రవి, చెంబేటి వీరబాబు, శ్రీనివాసరావు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here